గురుగ్రామ్: విదేశీ మహిళ లైంగికదాడికి గురైన ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్పానిష్ దేశానికి చెందిన మహిళ ఓ ఐటీ కంపెనీలో గత సంవత్సరం నుంచి ఇంటర్న్‌షిప్ చేస్తోంది. శుక్రవారం రాత్రి పార్టీలో పాల్గొన్న ఆమెపై.. అదే ఐటీ కంపెనీకి చెందిన అసిస్టెంట్ మేనేజర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. మహిళ ఇచ్చిన పిర్యాదు మేరకు మేనేజర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm