కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గ్లాస్ హౌజ్ సెంటర్లోని సూపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సూపర్ మార్కెట్లో మంటలు చెలరేగి మూడు అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని 8 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. మంటల్లో వస్తువులు కాలి బూడిదయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm