హైదరాబాద్ : తన పేరిట సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో ఓటు ఉందంటూ వస్తున్న కథనాలపై సినీ నటుడు మంచు మనోజ్ స్పందించారు. ఓ మీడియా సంస్థలో తన ఓటరు కార్డును ప్రదర్శిస్తూ కథనం రాశారని, అందులో పేర్కొన్న ఓటరుకార్డు తప్పుడు ఓటరు కార్డు అని మనోజ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. మీడియాలో చూపిస్తున్న ఓటరు కార్డులో నారాయణఖేడ్ చిరునామా ఉందని, వాస్తవానికి తన ఓటరు కార్డులో ఫిలింనగర్ చిరునామా ఉంటుందని వెల్లడించారు. ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని మంచు మనోజ్ కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm