హైదరాబాద్ : ట్రాఫిక్ పోలీస్‌పై ఓ యువతి చేయి చేసుకున్న ఘటన దేశ రాజధానిలో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హెల్మెట్ ధరించని కారణంగా ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఓ ద్విచక్ర వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి.. తమ వాహనాన్ని ఎందుకు అడ్డుకున్నారని ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగింది. అంతేకాకుండా ఆ కానిస్టేబుల్‌ను వెనక్కి నెట్టేస్తూ దురుసుగా ప్రవర్తించింది. బండి తాళంచెవిని ట్రాఫిక్ కానిస్టేబుల్ లాక్కోవడంతో మరింత రెచ్చిపోయిన ఆమె.. పోలీస్ అధికారిపై చేయి చేసుకుంది. అడ్డొచ్చిన ఇతర వాహనదారులతో కూడా వాగ్వాదానికి దిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు యువతితో పాటు ఆమె వెంటున్న మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో వాగ్వాదం చేసిన సమయంలో సదరు యువతి, మరో వ్యక్తి మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm