సూళ్లూరుపేట: ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 2.43 గంటలకు షార్ నుంచి జరగనున్న చంద్రయాన్-2 ప్రయోగ వీక్షణకు విచ్చేసే ప్రజల సౌకర్యార్థం సూళ్లూరుపేట నుంచి షార్‌లోని విజిటర్స్ గ్యాలరీ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ బండ్ల కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఈ బస్సులను నడపనున్నట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm