హైదరాబాద్ : ఆలమూరు మండలంలోని చొప్పెల్ల లాకుల సమీపంలో 16 నెంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురుకు స్వల్ప గాయాలైనట్లు స్థానిక ఎస్సై శుభాకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం రావులపాలెం వైపు నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న మోటార్ సైక్లిస్టు చొప్పెల్ల లాకుల వద్ద డివైడర్ దాటుతుండగా అదే మార్గములో వెనుకనే వస్తున్న లారీ మోటార్ సైక్లిస్టును తప్పించబోయి అదుపు తప్పి తిరగబడటంతో లారీలో గల డ్రైవర్, క్లీనర్ తో సహా మోటార్ సైక్లిస్టులు స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకుని క్షతగాత్రులను హైవే అంబులెన్స్ లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm