हरियाणा निवासी विशाल #haridwar स्थित कांगड़ा घाट पर नहाने गया था। तभी उसका पैर फिसला और वह गंगा के तेज बहाव में बहने लगा है। इसी दौरान वहां मौजूद #UttarakhandPolice के जवान #सन्नी की नजर उस पर पड़ी। सन्नी ने तत्काल गंगा में कूदकर युवक को कड़ी मशक्कत के बाद सकुशल बचा लिया। pic.twitter.com/g1qhBYKhlF
— Uttarakhand Police (@uttarakhandcops) July 20, 2019
హైదరాబాద్ : గంగా నదిలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని ఉత్తరాఖండ్ పోలీసు కాపాడాడు. హర్యానాకు చెందిన విశాల్.. హరిద్వార్ వద్ద గంగా నదిలో పవిత్ర స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. అదుపుతప్పి నదిలో కొట్టుకుపోయాడు. దీన్ని గమనించిన ఓ పోలీసు.. అతడిని కాపాడేందుకు సాహసం చేశాడు. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తి వద్దకు లైఫ్ జాకెట్ సహాయంతో పోలీసు వెళ్లి.. అతడిని నీటిలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. మొత్తానికి విశాల్ ప్రాణాలతో బయటపడ్డాడు. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసు సన్నీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.