తిరుమల: ఏపీ నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ముందుగా వరాహస్వామిని దర్శించుకున్న ఆయన.. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారి ఆలయం వద్ద తితిదే అధికారులు బిశ్వభూషణ్‌కు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్‌ను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సత్కరించి స్వామి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm