హైదరాబాద్ : ఈ నెల 30న 'సాహో' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక నేటి సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. 'సాహో' లోని ఓ స్టిల్ తో ప్రభాస్ భారీ కటౌట్ ను రూపొందించారు. అరవై అడుగులు ఎత్తు ఉన్న ఈ కటౌట్ ఆకట్టుకుంటోంది. ప్రీ-రిలీజ్ వేడుక నిమిత్తం భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm