హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికాగా, తరుణ్ కు ప్రాణాపాయం తప్పింది. హైదరాబాద్లో రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటన ఔటర్ రింగ్ రోడ్ నార్సింగ్ సమీపంలోని అల్కాపూర్ లో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. టీఎస్ 09 ఈఎక్స్ 1100 నంబర్ ఉన్న కారులో రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో రాజ్ తరుణ్ కు పెద్దగా గాయాలు కాకుండా బయటపడినట్టు తెలుస్తోంది. కారు ప్రమాదం తరువాత, రాజ్ తరుణ్ స్వయంగా ఫోన్ లో మాట్లాడి, మరో కారును తెప్పించుకుని వెళ్లిపోయాడని యాక్సిడెంట్ ను చూసిన స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm