విజయవాడ : ఆపదలో ఉన్న మహిళను కాపాడబోయి యువకుడు గల్లంతైన ఘటన విజయవాడ పరిధిలో చోటుచేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను రక్షించబోయిన యువకుడు గల్లంతయ్యాడు. బీఆర్టీఎస్ రోడ్డు సమీపంలోని రైవస్ కాల్వలో ఓ మహిళ దూకింది. మహిళను కాపాడేందుకు ముగ్గురు వ్యక్తులు కాల్వలోకి దూకారు. మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు ఒడ్డుకు సురక్షితంగా వచ్చారు. మూడో వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకుడు ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ వాసి శివరామకృష్ణగా గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm