హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు అస్లీల వెబ్ సైట్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అస్లీల వెబ్ సైట్ల పూర్తి వివరాలను అందించాలని గూగుల్ సంస్థకు నోటీసులు జారీచేసింది. పేస్ బుక్ ఫోటోలను మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్లలో పెడుతున్నారని, తన పేరు, ఫోటోలను పోర్న్ వెబ్ సైట్ల నుండి తొలగించాలని గతంలో గూగుల్ సంస్థకు ఓ యువతి ఫిర్యాదు చేయగా గూగుల్ సంస్థ స్పందించలేదని బాధిత యువతి హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు పూర్తి వివరాలను అందించాలని గూగుల్ సంస్థకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణకు సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm