నల్గొండ: జిల్లాలో యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానికులు పోరాటం ప్రారంభించారు. పెద్దగట్టు గ్రామంలో ఊరివారందరితో కలిసి టీవీవీ, గిరిజన హక్కుల సంఘం సమావేశమై ఈ అంశంపై చర్చలు జరిపాయి. అయితే అదే సమయంలో గ్రామంలో నీటి నమూనాలు తీసుకువెళ్లడానికి యూసీఐఎల్ ప్రతినిధులు రావడంతో అందరూ వారిని అడ్డుకున్నారు. యురేనియం ప్రాజెక్టు వద్దే వద్దని, వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. యూసీఐఎల్ ప్రతినిధులు నచ్చజెప్పేందుకు యత్నించినా గ్రామస్తులు వినలేదు. చివరికి యుసీఐఎల్ ప్రతినిధుల వాహనాన్ని గ్రామస్తులు వెనక్కి నెట్టేసి ఊళ్లో అడుగుపెట్టవద్దంటూ హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm