లీడ్స్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మూడో టెస్టుకు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌స్మిత్ దూరమయ్యాడు. రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆర్చర్ విసిరిన బౌన్సర్ స్మిత్ మెడపై బలంగా తగిలింది. దీంతో నొప్పి తాలలేని అతడు తొలిసారి కాంకషన్ ఔట్‌గా మైదానాన్ని వీడాడు. ఈ సిరీస్‌లో స్టీవ్ టాప్‌స్కోరర్‌గా ఉన్నాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్సుల్లోనూ సెంచరీలతో చెలరేగిన స్మిత్, రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 92పరుగులు సాధించాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని స్మిత్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్ ద్వారా తెలిపింది. స్టీవ్ అందుబాటులో ఉండక పోవడం ఇంగ్లాండ్ టీమ్‌కు లాభించే విషయమని క్రీడాపండితులు విశ్లేషిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm