న్యూఢిల్లీ: లెనోవో నుంచి అద్భుతమైన ఫీచర్లతో మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ వచ్చేసింది. లెనోవో కె10 ప్లస్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్లోని ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. 4జీబీ ర్యామ్ం64 జీబీ స్టోరేజీ, ట్రిపుల్ రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ను ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ నెల 30 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. లెనోవో కె10 ప్లస్ 4జీబీ ర్యామ్ం64 జీబీ స్టోరేజీ ధర రూ.10,999 మాత్రమే. లెనోవో కె10 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు: 6.22 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 9పై ఓఎస్, ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 632 చిప్సెట్,13 ఎంపీం8 ఎంపీం5 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 16 ఎంపీ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా అంతర్గత మెమొరీని 2 టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్న ఈ ఫోన్లో 4,050 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించారు.
Mon Jan 19, 2015 06:51 pm