జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్ లో ఓ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. సదరు వ్యక్తి జమ్మూ పట్ణణంలోని త్రికూట ప్రాంతంలో ఉన్న సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. ఇది గమనించిన స్థానికులు సెల్‌టవర్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు, రెస్క్యూ టీం చాలా సేపు కష్టపడి ఆ వ్యక్తిని సురక్షితంగా కిందికి దింపారు. మతిస్థిమితం లేకపోవడంతో సదరు వ్యక్తి సెల్‌టవర్‌పైకి ఎక్కాడని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm