ముంబయి: త్వరలో బీసీసీఐ పగ్గాలు చేపట్టనున్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి హర్భజన్ సింగ్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ట్విట్టర్లో భజ్జీ.. మీరో గొప్ప నాయకులు. మీలాంటి వ్యక్తి అత్యున్నత స్థానాన్ని అధిరోహించడం చాలా సంతోషం అని భజ్జీ తెలిపాడు. కాబోయే బీసీసీఐ అధ్యక్షుడికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ ప్రయాణం విజయవంతంగా సాగాలని భజ్జీ ఆకాంక్షించాడు. కాగా, భజ్జీ ట్వీట్‌కు గంగూలీ స్పందించాడు. ధన్యవాదాలు భజ్జూ.. మీ లాంటి వారి మద్దతు ఉంటే ఎలాంటి సవాల్‌నైనా స్వీకరిస్తాననీ, మైదానంలో ఆఫ్ స్పిన్‌తో ఎన్నో మ్యాచ్‌లు గెలిపించిన నీవు నాకు శుభాకాంక్షలు చెప్పడం చాలా సంతోషంగా ఉంది అని దాదా తెలిపాడు.
Mon Jan 19, 2015 06:51 pm