హైదరాబాద్: ఎవరూ ఊరికే మెగాస్టార్ కాలేరు అని అంటున్నారు డైరెక్టర్ తేజ. తాజా ఓ ఫిలిం ఇన్స్టిట్యూట్కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. 'చిరంజీవిగారు నటించిన ఓ సినిమాకు నేను కెమెరా విభాగంలో పనిచేశాను. ఆ సమయంలో చిరంజీవిగారిపై డైరెక్టర్ ఓ షాట్‌ను ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఆయన పరిగెత్తుకుంటూ వెళ్లాలి. డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే ..చిరంజీవిగారు పరిగెత్తారు. డైరెక్టర్ షాట్ ఓకే అన్నారు. అయితే చిరంజీవిగారు వన్ మోర్ టేక్ అన్నారు. ఎందుకని ఆయన్ని అడిగితే ఆ సీన్లో పెట్టిన 20 రిఫ్లెక్టర్స్లో ఓ రిఫ్లెక్టర్ పనిచేయలేదు. అక్కడ లైటింగ్ తగ్గిందని ఆయన అన్నారు. నటనపై అంత అకింతం భావం ఉంది కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యారు. అలా ఓ నటుడికి తన నటన పట్ల ఆసక్తి, శ్రద్ధ ఉండాలి. ఊరకనే ఎవరూ మెగాస్టార్లు అయిపోరు' అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm