వరంగల్: జిల్లాలోని మడికొండ దగ్గర ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర తాత్కాలిక డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. హన్మకొండ నుంచి తరిగొప్పుల వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm