You want to see how does a narrow escape looks like in case of encounter with a #tiger. #Tiger was cornered by the crowd. But fortunately end was fine for both man and tiger. Sent by a senior. pic.twitter.com/1rLZyZJs3i
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) January 25, 2020
ముంబై: ఒళ్లు గగుర్పొడిచే ఘటన! మరి కాసేపట్లో తన ప్రాణాలు పోయేవే! కానీ అతడి సమయస్ఫూర్తే అతడిని కాపాడింది. చావు అంచులవరకూ వెళ్లి తిరిగొచ్చేలా చేసింది.ప్రమాదం నుంచి తృటిలో బయటపడటం అంటే ఏంటో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. పులికి దొరికిపోయిన ఓ వ్యక్తి.. దాన్నుంచి ఇలా బయటపడ్డాడు. నా సీనియర్ ఒకరు ఈ వీడియోను పంపించారు అంటూ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాస్వాన్ తాజాగా ట్విటర్లో షేర్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని భండారా జిల్లాలో జరిగింది. పొలంలో నుంచి పులిని తరిమేసే క్రమంలో కొందరు గ్రామస్థులు దాన్ని చుట్టుముట్టారని అతడు తెలిపాడు. అయితే అక్కడి నుంచి పారిపోయేటప్పుడు కంగారు పడిన పులి.. ఓ వ్యక్తిని దొరకపుచ్చుకుంటుంది. అయితే పులి ముందు కదలకుండా పడుకుని సదరు వ్యక్తి ప్రాణం లేనట్టుగా నటించాడని చెప్పాడు. ఈలోపు మిగతా గ్రామస్థులు పులిని సమీపించడంతో అది పారిపోయిందని తెలిపాడు. సదరు వ్యక్తి అలా నటించకపోయి ఉంటే ఈపాటికి ప్రాణాలు పోయుండేవని వ్యాఖ్యానించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.