హైదరాబాద్ : రాత్రి భోజనానికి వంట సిద్ధం చేస్తున్న ఓ కెనడా మహిళకు నిర్ఘాంతపోయే సంఘటన ఎదురైంది. నికోలే గాగ్నన్, జెరార్డ్ బ్లాక్బర్న్ దంపతులు కెనడాలోని క్యుబెక్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఫిబ్రవరి 9న నికోలె కూరగాయలు కోస్తున్నారు. వాటిలోని క్యాప్సికంలో ఓ చిన్ని కప్ప కనిపించింది. అదీ బతికి ఉన్నది కావడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. చెట్లపై ఉండే ఆకుపచ్చని కప్ప అందులోకి ఎలావచ్చిందో ఆ దంపతులకు అంతుచిక్కలేదు. దీంతో వారు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. కాగా సోషల్ మీడియాలో ఈ సంఘటన విపరీతంగా వైరల్ అవుతోంది. కూరగాయలు కోస్తున్నప్పుడు తమకు ఎదురైన విచిత్ర అనుభవాలను నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm