హైదరాబాద్ : సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్ అసమానమైన ప్రతిభా పాటవాలను కనబరుస్తూ వస్తున్నారు. సంగీత ప్రపంచానికి తనవైన బాణీలను పరిచయం చేసిన ఆయన, తాజాగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. తన అభిరుచికి తగినట్టుగా సంగీతం నేపథ్యంతో కూడిన సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి '99 సాంగ్స్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఒక స్ట్రగులింగ్ సింగర్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఎహాన్ భాట్ .. ఎడిల్సి వెరగాస్ .. మనీషా కొయిరాలా .. లీసారే .. థామస్ ఆండ్ర్యూస్ .. ప్రధానమైన పాత్రలను పోషించారు. సంగీతమే ప్రధానంగా .. సంగీతమే ప్రధాన కథావస్తువుగా రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
Mon Jan 19, 2015 06:51 pm