న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌కు నమస్తే ట్రంప్ పేరుతో భారత ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలుకుతుంటే.. మరోపక్క ఆయనకు వ్యతిరేకంగా గో బ్యాక్ ట్రంప్ నినాదాలు కూడా వినపడతున్నాయి. ట్విట్టర్ ట్రెండింగ్‌లో గో బ్యాక్ ట్రంప్ టాప్ ప్లేస్‌లో ఉంది. పొలిటికల్ ట్రెండ్స్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తున్నాయి. ఇమ్మిగ్రేషన్‌కు వ్యతిరేకంగా ట్రంప్ నిర్ణయాలు ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడతున్నారు. అమెరికన్ చరిత్రలో ఇలాంటి ప్రెసిడెంట్‌ను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా హెచ్1బీ వీసాలపై అమెరికన్ గవర్నమెంట్ పెడుతున్న కొర్రీలను తమ ట్వీట్లలో ఎత్తిచూపుతున్నారు. అయితే గోబ్యాక్ ట్రంప్ ప్రచారంపై మరికొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అతిథిదేవో భవ అనేది భారతీయ సంస్కృతి అని.. అతిథిని దేవుడితో సమానంగా భావిస్తారని.. ఇలా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం సరైంది కాదని ట్వీట్స్ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm