హైదరాబాద్ : బాలానగర్ లో అగ్నిప్రమాదం జరిగింది. గాంధీ నగర్లోని యాస్ ఫ్యాన్ల కంపెనీలో గురువారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. అగ్నిప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు కంపెనీ యజమానులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm