విజయవాడ: తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ మండలంలోని సర్పవరంలో గ్రామంలో ఒక పరిశ్రమ నుండి గ్యాస్ లీకైంది. స్థానిక టెకీ రసాయన పరిశ్రమ నుంచి ఈ గ్యాస్ లీకవుతోంది. దీంతో స్థానిక అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. స్థానికులను ఈ వార్త కలవర పెడుతోంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm