హైదరాబాద్ : రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో వేణు ఉడుగుల తెరకెక్కించిన చిత్రం విరాట పర్వం. డి.సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలు. ఓ సామాజిక సమస్యను చర్చిస్తూ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పోరాట ఘట్టాల్ని హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచర్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి నక్సలైట్ పాత్రలో కనిపించనున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. ఈ రోజు ప్రియమణి బర్త్‌డే కావడంతో ఆమె పాత్రకి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు మేకర్స్ . మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది.ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాట పర్వం లో 'కామ్రేడ్ భారతక్క' కూడా అంతే కీలకం అంటూ ప్రియమణి పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ప్రియమణి లుక్ అభిమానులని ఆకట్టుకుంటుంది.
Mon Jan 19, 2015 06:51 pm