బోనకల్లు : ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తరంగా కురుస్తున్నాయి. వరద ప్రవాహాలతో వాగులు, వంకలు పొంగి ప్రహిస్తున్నాయి. ఈ క్రమంలో బోనకల్లు మండలం చిన్న బీరవల్లి గ్రామ సమీపంలోని వాగు వరద ఉదృతికి పోటెత్తింది. వరద ఉదృతికి తాళలేక కారు వాగులో కొట్టుకుపోయింది. వైరా జగ్గయ్యపేట ప్రధాన రోడ్డుమార్గంలో జానకిపురం వద్ద రహదారికి మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రెండు లారీలు దిగుబడిపోయాయి. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాపల్లె క్రాస్‌రోడ్ చిన్న బీరపల్లి గ్రామాల మధ్య పెద్దవాగు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇదే సమయంలో బోనకల్లు వెళ్లేందుకు కారులో నలుగురు వ్యక్తులు వచ్చారు. వాగుపై బ్రిడ్జిని దాటేక్రమంలో వరద ఉదృతి పెరగడంతో కారు వాగులో కొట్టుకుపోయింది. స్థానికులు వెంటనే వాగులోకి దూకి నలుగురిని రక్షించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.
Mon Jan 19, 2015 06:51 pm