నెల్లూరు: జిల్లాలోని ఆత్మకూరు మండలం బసవరాజు పాలెంలో దారుణం చోటు చేసుకుంది. 11 ఏళ్ల చిన్నారిపై 35 ఏళ్ల ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకెళితే.. 11 ఏళ్ల బాలిక మేకలను మేపుతుండగా అదే గ్రామానికి చెందిన నిందితుడు బాలికకు తన సెల్ ఫోన్లో బూతు బొమ్మలు చూపించాడు. ఆపై లైంగికదాడికి ఒడిగట్టాడు. సదరు బాలిక నిందితుడికి కూతురు వరుస అవుతుంది. కాగా, జరిగిన విషయాన్ని బాలిక తన ఇంట్లో చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm