Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిందూత్వ ఎజెండాతో ముందుకు పోతున్న వీరికి వామపక్ష
ప్రభుత్వం నిలబడటం, ఎదగడం, అత్యున్నత స్థాయిలో ప్రజాధారణ
పొందడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే కేరళలో జరగని
విషయాలను జరిగినట్టుగా చూపి హిందూ, ముస్లింల మధ్య
విభేదాలు సృష్టించి మత విద్వేషాలను రెచ్చగొట్టడానికే 'ది కేరళ స్టోరీ'
రూపొందించ బడిందని అర్థమవుతోంది. కానీ ఈ అభూత కల్పనలు
సృష్టిస్తే నమ్మేంత అమాయకులు కాదు కేరళ ప్రజలు.
ఒక స్క్రీన్‌ప్లే... అనేక టేక్‌లు... వందల సీన్లు... కట్ చేస్తే ఎ ఫిల్మ్ బై 'సంఘ్‌పరివార్'... అర్థం కాలేదనకుంటా! అదేనండి 'ది కేరళ స్టోరీ' సినిమా గురించి. చేసే వ్యూహాలు, ఎత్తుగడలు ఫలించనప్పుడు సహనం కోల్పోతారు. భావదాడికి బదులు భౌతికదాడికి దిగుతారు.యుద్ధాలకు కత్తులు నూరుతారు. అల్లర్లు సృష్టిస్తారు. మతం రంగు పులు ముతారు. అన్యాయంతో రాజ్యమేలుతారు. ఇప్పుడు దేశంలో జరుగుతున్నదదే. అలాంటి అరాచకమైన ఆర్ఎస్ఎస్, సంఫ్‌ుపరివార్ అంతర్గత ఎజెండాయే 'ది కేరళ స్టోరీ'. కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు తీసిన సినిమా ఇది. కానీ ఇంతటి నీచమైన సంస్కృతికి సంఫ్‌ుపరివార్ ఎందుకు తెరదీసిందనేదే ఇక్కడ అసలైన ప్రశ్న. లేనిది ఉన్నట్టు,ఉన్నది లేనట్టు చేయడంలో ప్రపంచంలోనే దానికంటే సిద్ధహస్తులు ఎవ్వరూ ఉండరు. అందులో వారంతా ఆరి తేరినవారు. ప్రభుత్వాలను పడగొట్టాలన్నా, ప్రజలపై భారాలు వేయాలన్నా, విద్వేషాలు రెచ్చగొట్టాలన్న వెనకనుంచి నడిపించేది ఈ పరివారమే! ఇప్పుడు కేరళలోనూ అటు వంటి కుతంత్రాలే జరుగుతున్నాయి. ''ది కేరళ స్టోరీ.''
అసలు కేరళలో ఏం జరిగింది? ఏ ఆధారంతో సినిమా తీశారు? ఇలా సందేహాలు సహజం.అనుమానాలను నివృత్తి చేసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అనివార్యం. రాష్ట్రంలో 32వేల మంది ముస్లిం బాలికలు గల్లంతయినట్టు, వారంతా ఐఎస్‌లో చేరినట్టు ఈ చిత్రంలో చూపారు. కేరళలో ఇస్లామిక్ తీవ్రవాదం పెచ్చరిల్లు తున్నదని, అమ్మాయిలను 'లవ్ జిహాద్' పేరుతో ప్రేమలోకి దింపి తర్వాత మతం మార్చడం నిరాటంకంగా జరుగుతున్నదని, వారిని లవ్‌జిహాద్ ద్వారా ఇస్లాంలోకి మార్చి సిరియాకు తరలించారన్నది ఈ చిత్ర కథాంశం. పూర్తిగా కట్టుకథలు, అవాస్తవాల ఆధారంగా రూపొందిందీ సినిమా. దీనికి కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ అంతా ఆర్ఎస్ఎస్ యే అనేది బహిరంగ రహస్యం.అందుకే కేరళ సీఎం పినరయి విజయన్ ఈ చిత్రాన్ని సంఫ్‌ు పరివార్ అబద్ధాల ఫ్యాక్టరీలో తయారైన తప్పుడు ఉత్పత్తిగా అభిర్ణించారు. 'లవ్ జిహాద్' అన్నది కేరళలో గతంలో లేదు. వర్తమానంలో అంతకన్నా కనపడదు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డిగారే అంగీకరించిన అంశమిది. కేరళపై ఈ ప్రచారాలను సుప్రీంకోర్టు కూడా తోసి పుచ్చింది. ఎందుకంటే ఇదంతా నిరాధారమైన ఇస్లామో ఫొబియో కుట్ర సిద్ధాంతం. మత విభజనే దీని ప్రధాన లక్ష్యం.దానికి ఆజ్యం పోస్తూ లబ్ది పొందాలని చూస్తున్నది సంఫ్‌ుపరివార్, ఆర్ఎస్ఎస్.
కేరళలో ప్రజాపరిపాలన సాగుతున్న విషయం దేశమంతా తెలిసిందే. కేంద్రం సాయం లేకున్నా తుఫాన్ల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవడాన్ని ప్రపంచమంతా చూసింది. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా అక్కడ బీజేపీ ఆటలు చెల్లుబాటు కావు. దేశంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం. అందులో లౌకికవాదం, సంక్షేమ రాజ్యంతో ప్రజలకు మేలు చేసే పథకాలు, కార్యక్రమాలు అక్కడి వామపక్ష ప్రభుత్వం చేపడుతోంది. ఈ ప్రజాస్వామిక కూటమిని అస్తిర పరచాలని, మత విద్వేషాలను రెచ్చగొట్టాలని ఆర్ఎస్ఎస్ ఎప్పటినుంచో యత్నిస్తోంది. అయ్యప్ప ఆలయానికి మహిళల్ని అనుమతించకూడదనే డిమాండ్‌తో చిచ్చు రాజేసింది.దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది పినరయి సర్కార్. అంతకు ముందు ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలు చేస్తే అది ఏమాత్రం నిలబడలేదు. కేరళలో వామపక్ష ప్రభుత్వం ఉన్నంతవరకు వీరు అక్కడ ఆధిపత్యం సాధించే అవకాశం లేదు. అధికారంలోకి వచ్చే పరిస్థితి అంతకన్నా లేదు. ఇక చేసేదేమీ లేక ఇలాంటి వ్యూహాత్మక మార్గాలను అనుసరిస్తున్నారు. కానీ ఇక్కడ దాన్ని నమ్మేవారు లేరు.
ది కేరళ స్టోరీ సినిమాను బీజేపీ మినహా కేరళలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎండగడు తున్నాయి. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే అభివర్ణిస్తు న్నాయి.ఈ సినిమాను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనివల్ల కేరళలో మతపరమైన అల్లర్లు చెలరేగే ప్రమాదముందని నిఘా సంస్థలు కూడా హెచ్చరి స్తున్నాయి. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. సినిమా ప్రదర్శన అడ్డుకోవాలని వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల కూటమితో పాటు, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా పిలుపునివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం.ఈ సినిమా ద్వారా కేరళలోని వామపక్ష ప్రభుత్వాన్ని లక్ష్యంగా పెట్టుకుందని సామాజిక కార్యకర్తలు, లౌకిక ప్రజాస్వామికవాదులు విమర్శిస్తున్నారు.
హిందూత్వ ఎజెండాతో ముందుకు పోతున్న వీరికి వామపక్ష ప్రభుత్వం నిలబడటం, ఎదగడం, అత్యున్నత స్థాయిలో ప్రజాధారణ పొందడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే కేరళలో జరగని విషయాలను జరిగినట్టుగా చూపి హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి మత విద్వేషాలను రెచ్చగొట్టడానికే 'ది కేరళ స్టోరీ' రూపొందించ బడిందని అర్థమవుతోంది. కానీ ఈ అభూత కల్పనలు సృష్టిస్తే నమ్మేంత అమాయకులు కాదు కేరళ ప్రజలు.