Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర జనాభాలో 53శాతంగా మెయితీ తెగ షెడ్యూలు కులాల జాబితాలో చేర్చాలని చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. అది వీలవుతుందో కాదో చట్టబద్దమో కాదో స్పష్టంగా చెప్పాల్సిన న్యాయస్థానమే... వారి కోర్కెను పరిశీలించాలని గత నెల 20న రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. దాన్ని గనుక అమలు జరిపితే గిరిజనులైన కుకీలు, నాగాలు భూములు కోల్పోతామని భయపడ్డారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం వారి అనుమానాలను తీర్చే ప్రయత్నం చేయకపోవడంతో... సిఎం బిరేన్ సింగ్ చురుచందపూర్ అనే చోట ఒక జిమ్‌ను ప్రారంభించేందుకు రానుండగా, ముందు రోజు నిరసనకారులు దాన్ని తగులబెట్టారు.
''కండ్లముందే ఊళ్లు కాలిపోయాయి. క్యాంపస్‌లో ఉండబట్టే బతికి బయటపడ్డాం. బాంబుల మోతలు, తుపాకీ తూటాల చప్పుళ్లు... ఇప్పటికీ వణుకుపుట్టిస్తున్నాయి.'' ఇది మణిపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్న విద్యార్థుల ఆవేదన. ఈ వ్యాఖ్యలు కల్లోలిత మణిపూర్ తాజా పరిస్థితికి నిదర్శనం. మణిపూర్ ఒక్కసారిగా జాతి వైషమ్యాలతో ఎగసిపడుతోంది. 60శాతంపైగా ఉన్న మెయితీలకూ, 40శాతం ఉన్న కుకీలు, నాగా గిరిజన జాతులకూ మధ్య రగిలిన చిచ్చు నేడు మణిపూర్ అస్తిత్వాన్నే ప్రశ్నిస్తుంది. అది చినికి చినికి గాలివానగా మారి అరవై ప్రాణాలను పొట్టన పెట్టుకున్నది. మతం రంగునూ పులుముకొన్న ఈ ఘర్షణలకు వందలాది మంది క్షతగాత్రులయితే... వేలాది మంది సాధారణ ప్రజలు నిరాశ్రయులై సైనిక కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇదే ఘోరకలి మరో విపక్షపాలిత రాష్ట్రంలో జరిగివుంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? రాష్ట్రపతి పాలన విధించి తక్షణమే తన అధీనంలోకి తెచ్చుకునేది! అక్కడ చేతకాని ప్రభుత్వం ఉండటం వలనే ఇలాంటి ఘోరం జరిగిందని ఎదురుదాడి చేసేది. అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకునేది కాదు! కానీ, ఇప్పుడు తమ పాలనలోనే మణిపూర్ మండుతుంటే ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేస్తోంది?! ఇదంతా ఏలినవారి ఎజెండాలో భాగమే అన్నది బహిరంగ రహస్యమే. అందుకే ప్రధానమంత్రిగారు ఇంత వరకు మాటవరుసకైనా స్పందించలేదు.
మెయితీ తెగను ఎస్టీల్లో చేర్చేందుకు వీలుగా కేంద్రానికి సిఫార్సు చేయాలని మణిపూర్ హైకోర్టు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానిపై కుకీ, నాగా గిరిజనుల అభ్యంతరాలే నేటి ఘర్షణలకు ప్రధాన కారణాలైనప్పటికీ, పరిష్కారంలో అధికార పక్షం నిర్లక్ష్యానికి అర్థమేమిటీ? విధ్వంసాలతో తెగల మధ్య వైరం నివురుగప్పిన నిప్పులా ఎండ్ల తరబడి రగులుతోంది. సామాజికంగా, రాజకీయంగా శక్తిసంపన్నులైన మెయితీలను ఎస్టీ జాబితాలో చేరిస్తే తమ అస్తిత్వానికి ముప్పు వాటిల్లుతుందని గిరిజనుల కలవరం. కొండ ప్రాంతాల్లోని రక్షిత అటవీ స్థలాల్లో నివసిస్తున్న వారిని బయటికి తరలించేందుకు బీజేపీ సర్కారు ఇటీవల చేపట్టిన 'గిరిజనం' కార్యక్రమం ఆ భయాన్ని మరింత పెంచింది. రెండు వర్గాల మధ్య ఐక్యతను ప్రోదిచేయడంలో, ఆదిలోనే ఘర్షణలకు అడ్డుకట్ట వేయడంలో 'డబల్ ఇంజన్' సర్కార్ ఘోరంగా విఫలమైంది. అందుకే పరిస్థితి పూర్తిగా కట్టుతప్పింది. కానీ, మెజారిటీలైన మెయితీలను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలన్నదే పాలక పార్టీ ఆలోచనైతే మాత్రం ఇంతటి ప్రమాదాన్నీ లక్ష్యపెట్టరా?! భౌగోళికంగా సున్నితమైన ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి శూన్యమైతే అది దేశ భద్రతకే పెనుప్రమాదం.
రాష్ట్ర జనాభాలో 53శాతంగా మెయితీ తెగ షెడ్యూలు కులాల జాబితాలో చేర్చాలని చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. అది వీలవుతుందో కాదో చట్టబద్దమో కాదో స్పష్టంగా చెప్పాల్సిన న్యాయస్థానమే... వారి కోర్కెను పరిశీలించాలని గత నెల 20న రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. దాన్ని గనుక అమలు జరిపితే గిరిజనులైన కుకీలు, నాగాలు భూములు కోల్పోతామని భయపడ్డారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం వారి అనుమానాలను తీర్చే ప్రయత్నం చేయకపోవడంతో... సిఎం బిరేన్ సింగ్ చురుచందపూర్ అనే చోట ఒక జిమ్‌ను ప్రారంభించేందుకు రానుండగా, ముందు రోజు నిరసనకారులు దాన్ని తగులబెట్టారు. దాన్ని ఆదిలోనే అంతం చేయాల్సిన ప్రభుత్వం... కనిపిస్తే కాల్చివేత ప్రకటించి నిరసనకారులను మరింత రెచ్చగొట్టింది. గిరిజన విద్యార్థి సంఘం మే మూడో తేదీన చురుచందపూర్‌లో గిరిజన సంఘీభావ ప్రదర్శనకు పిలుపునిచ్చింది. ఆ సందర్భంగా హింసాకాండ చెలరేగింది. గిరిజనేతర ప్రాంతాల్లోని గిరిజనుల మీద, చర్చిల మీద దాడులు జరిగి రాష్ట్రం అగ్నిగుండమైంది.
చిత్రం ఏమిటంటే మరో రోమ్ నగరంగా మణిపూర్ తగలపడుతుంటే... మోడీ మాత్రం మరో నీరో చక్రవర్తిలా ఎన్నికల ఫిడేల్ వాయించుకుంటున్నారే కానీ, ఇంత జరుగుతున్నా ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. కల్పిత కట్టుకథలతో కేరళ సమాజాన్ని అవమానపరిచేందుకు తీసిన 'కేరళ స్టోరీ' గురించి మాట్లాడతారు. 'జై భజరంగ భళీ'... అంటూ మతం పేరుతో కన్నడనాట రాజకీయం చేసేందుకు, ట్వీట్లతో ఎదురుదాడికి దిగేందుకు మాత్రం తీరిక దొరుకుతుంది. కానీ, రెజ్లర్ల మీద పోలీసు జులం గురించో, కాశ్మీర్, మణిపూర్ గురించో పట్టించుకోవడం అటుంచి, కనీసం ప్రస్తావించడానికి కూడా వారికి తీరిక దొరకదు! ఈశాన్య రాష్ట్రంలో తెగల నడుమ రాజుకున్న విద్వేషాగ్నుల్ని చల్లార్చేందుకు కేంద్రమే చొరవ తీసుకోవాలి. సామాజిక అశాంతిని రూపుమాపి శాంతి భద్రతలు నెలకొల్పి ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వాలి.