Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
విద్యుద్ఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మండలం లోని వరికోల్ పల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఆమ్లెట్ గ్రామమైన కమ్మర్పల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన యువ రైతు మెరుగు రమేష్(34) తన వ్యవసాయ బావి వద్దకు పొలానికి నీళ్లు పెట్టడం కోసం మధ్యా హ్నం వెళ్ళాడు. మోటారు ఆన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మతి చెందాడు. పొలా నికి వెళ్లిన రైతు రాకపోయేసరికి సాయంకాలం గమనించిన కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. మతు నికి భార్య కూతురు కుమారుడు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన రైతు మెరుగు రమేష్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మతి చెందిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ సాంబయ్య ప్రభుత్వాన్ని కోరారు.