Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలయాభివృద్ధికి సీడీఎఫ్ నిధులు పది లక్షల మంజూరు : ఎమ్మెల్యే
నవతెలంగాణ-లింగాలఘనపురం
స్వయంభూ బండగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభి వృద్ధి కోసం సిడిఎఫ్ నిధులు పది ల క్షల రూపాయల మంజూరు చేస్తు న్నట్లు ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శుక్రవారం బండగుట్ట శ్రీ లక్ష్మినరసింహా స్వా మి వారి విగ్రహ ప్రతిస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామి వారి కరుణాకటాక్షాలతో బండ్లగూడెం ప్రజలు, మండల ప్రజలు, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని సుఖ సంతోషాలతో, శాంతి సమాధానంతో ఉం డాలని పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ లక్ష్మీనరసింహస్వామి వారికి మొక్కుకున్నానని తెలిపారు.దేవాలయ అభివృద్ధిలో భాగంగారోడ్డు సదుపాయం కల్పనకు సిడిఎఫ్ నిధుల నుండి గతంలో 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, దేవాలయ అభివృద్ధి విషయంలో ఆలయ కమిటీ, సర్పం చ్ కలిసివస్తే సంబంధిత పనులకు నిధులు మంజూరుచేస్తానన్నారు. ఇప్ప టికే ఈ దేవాలయంలో ధూపదీప నైవేద్యం కోసం దేవాదాయ శాఖకు లెటర్ పంపి యున్నాము అది త్వరగా అయ్యేటట్టుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి త్వరగా అయ్యేటట్టు చూస్తానని తెలిపారు. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫ లితాలలో ఉత్తీర్ణత సాధించి మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి సత్కరించి అభినందించారు. ఈకార్యక్రమంలో సర్పం చ్లు కాటం విజయకుమార్ స్వామి, విజయమనోహర్, శ్రీపాల్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు నాగేందర్, భాగ్యలక్ష్మి, విష్ణు,మధు పాల్గొన్నారు.