Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిన్నగూడూరు
మండలంలోని జయ్యారం గ్రామంలో పైపు లైన్ లీకేజీతో తాగునీరు కలుషి తం అయి అనారోగ్యం పాలవుతున్నామని, వీధులు చెరువును తలపిస్తున్నాయని గ్రామస్థుల ఆరోపిస్తున్నారు.గ్రామశివారులో ఉన్న మంచినీటి భావి నుంచి ఎస్సీ కాలానికి త్రాగునీరు అందించే మెయిన్ పైపులైన్ ఎరుకలకాలనీ వద్దలీక్ అయిం దన్నారు. కొన్ని కాలనీలకు మంచినీరు అందక ఇబ్బందులు పడుతుంటే మరికొ న్ని వీధుల్లో పైపు లైన్ లికేజితోనీరు వృథాగా పోతుందని ఆరోపిస్తున్నారు. ఇట్టి విషయమై గ్రామ సర్పంచ్, కార్యదర్శులకు విన్నవించిన పట్టించుకోవడం లేద న్నారు. ఇటీవల విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో మంచినీటి బావికి అమర్చి న స్టార్టర్లను విద్యుత్ అధికారులు తీసుకుపోయి గ్రామానికి కొన్నిరోజులు మంచి నీటి సరఫరా నిలిచిందన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామ సమస్య లను పరిష్కరించి పైపులైన్ లీకేజీని అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.