Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన
నవతెలంగాణ-పాలకుర్తి
సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చే యాలని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు చెరిపెల్లి మహేందర్, మారపల్లి ప్రవీణ్ కుమార్లు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం తహసిల్దార్ భూక్య పాల్ సింగ్ నాయక్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం అసెంబ్లీ సాక్షిగా పలుమార్లు వీఆర్ఏలకు గతంలో ఇచ్చిన పేస్కేల్తో పాటు అర్హులైన వారి కి ప్రమోషన్లు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీలను అమలు చేసి వీఆర్ ఏలకు న్యాయం చేయాలని అన్నారు. 2022 మే 12వ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ లు 80 రోజులు నిరవధిక సమ్మె చేశామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు ఉప ఎన్నికకు ముందు వీఆర్ఏలతో చర్చలు జరిపి వీఆర్ఏల డిమాండ్లను త్వర లోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించామని తెలిపారు. సమ్మె సందర్భంగా ప్రభుత్వం వీఆర్ఏలకు హామీ ఇచ్చి ఏడాది గడిచి నప్పటికీ ఏ ఒక్క సమస్య అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.సమ్మెకాలం నాటి వేతనాన్ని నేటి వరకు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని లేనియెడల మరోమారు సమ్మె కు దిగుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల ఉపఅధ్యక్షుడు రొడ్డ నర్సింగరావు, కో శాధికారి కట్ల సుభాష్, బేబీ రమేషు, కమలాకర్, పాల్గొన్నారు.
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి : మండల అధ్యక్షుడు వేణు కుమార్
పెద్దవంగర : దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డి మాండ్ చేస్తూ శుక్రవారం గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో వీఆర్ఏలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీతో ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తోట వేణు కుమార్ మాట్లా డుతూ వీఆర్ఏల సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైం దని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ 21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెం టనే అమలు చేయాలన్నారు. వీఆర్ఏలను పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖకు బదిలీ చేయాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అర్హతగల వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని, ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ రమేష్ బాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సం ఘం నాయకులు చన్న నాగరాజు, జలగం సతీష్, రమణబోయిన రవి, నీరటి సోమక్క, అంజయ్య, వెంకటయ్య, రామచంద్రు, శోభ పాల్గొన్నారు.