Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
బీసిల అభ్యున్నతికి,రిజర్వేషన్ కోసం కృషి చేసిన పితామహుడు మాన్యశ్రీ బిందెశ్వర ప్రసాద్ మండల్ విగ్రహావిష్కరణ పుట్ట లింగమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో ఉంటుందని 8 కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని బిఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.శనివారం మండల కేంద్రమైన తాడిచెర్లలో విగ్రవిష్కరణ పోస్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తొలిసారిగా మంథనిలో మొట్టమొదటి సారిగా పెద్దపల్లి జడ్పి చైర్మన్ పుట్ట మదు అధ్వర్యంలో బిపి మండల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేయట్టడం చారిత్రత్మాక నిర్ణయమన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాఘవ రెడ్డి,పిఏసిఎస్ ఛైర్మెన్ మల్క సూర్యప్రకాష్ రావు, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు గోనె శ్రీనివాస్ రావు, మండల బిసి సెల్ అధ్యక్షులు గుమ్మడి రవి,బిఆర్ఎస్ నాయకులు రామరావు, కోట రవి గౌడ్, వాల యాదగిరి రావు,తాడిచర్ల సర్పంచ్ సత్యనారాయణ మరియు మండల అధికార ప్రతినిధి మరియు కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ బండి రాజయ్య, మండల ప్రధాన కార్యదర్శి భుడిద మల్లేష్ మంథని మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు సమ్మయ్య నాయక్, రాజేశ్వర్ రావు,మండల ఉపాధ్యక్షులు మెడగని సాంబయ్య గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షులు మధు సుధన్ రావు,నాయకులు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ లక్ష్మణ్,బాపు తాండ్ర మల్లేష్, మంథని సమ్మయ్య, రాజు,వివిధ గ్రామాల అధ్యక్షులు పురుషోత్తం రావు, నార రమేష్ పాల్గొన్నారు.
బి పి మండల్ విగ్రహ ఆవిష్కరణ గోడ పత్రిక ఆవిష్కరణ
మహాదేవపూర్ : మండల కేంద్రము లో బి ఆర్ ఎస్ పార్టీ మంథని నియోజక వర్గం ఇంఛార్జి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ భూపాలపల్లి జడ్పీ చేర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ గార్ల ఆదేశాల మేరకు ఈనెల 16 వ తేదీన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీసీ హక్కుల కోసం పోరాటం చేసిన సంఘసంస్కర్త బీపీ మండల్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సంబంధించిన గోడ పత్రికను బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ లింగంపల్లి శ్రీనివాస్ రావు గారి ఆధ్వర్యంలో శనివారం మహాదేవపూర్ మండల కేంద్రంలో ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కార్యక్రమాన్ని ఎస్ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతి బాపు, పీఏసీఎస్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పెండ్యాల మమత మనోహర్, బి ఆర్ ఎస్ పార్టీ మంథని నియోజక వర్గం ఇంఛార్జి కేదారీ గీత , జిల్లా గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, యూత్ మండల అధ్యక్షులు అలిం ఖాన్, నియోజక వర్గ యూత్ ప్రధాన కార్యదర్శి మెరుగు శేఖర్, బీసీ సెల్ మండల అధ్యక్షులు కారేంగుల బాపు రావు, ఎస్ సి సెల్ మండల అధ్యక్షులు జక్కయ్య, మహిళ అధ్యక్షురాలు ఒడేటి స్వప్న, సీనియర్ నాయకులు అన్కరి ప్రకాష్, పెండ్యాల మనోహర్, పోత వెంకటస్వామి,సోషల్ మీడియా ఇంఛార్జి దబ్బేటరవీందర్, సాయిబాబా ఆలయం చేర్మెన్ మెరుగు లక్ష్మణ్, పట్టణ యూత్ అధ్యక్షులు రేవెల్లి రాజశేఖర్ యూత్ ఆర్గనైజర్ చిలుక రమేష్, సీనియర్ నాయకులు ఎండీ అక్రమ్, చాకినరపు చంద్, ధర్మయ్య,తలారి గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.