Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
- పత్రిక అభివద్ధిలో భాగస్వాములు కావాలి
- వరంగల్ ఉమ్మడి జిల్లా రీజనల్ మేనేజర్ దేవేందర్ రావు
- భూపాలపల్లి లో నవతెలంగాణ విలేకరులు సిపిఐ(ఎం ) ప్రజాసంఘాల నాయకుల వర్క్ షాప్
నవతెలంగాణ-భూపాలపల్లి
సమాజంలోని పేదప్రజల సమస్యలపై నిరం తరం పోరాడుతూ గుడిసెవాసులకు వెన్నుదన్నుగా ఉంటు పేద ప్రజలకు ఆర్తనాధాలను వినిపించే పత్రిక 'నవతెలంగాణ' మాత్రమేనని పేద ప్రజల గొంతుకైనా ఈ పత్రికను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని శ్రామిక భవనంలో నవతెలంగాణ విలేకరులు సిపిఐ (ఎం) పార్టీ ప్రజాసంఘాల నాయకుల నవ తెలంగాణ క్యాంపెయిన్ ఉమ్మడి సమావేశానికి సిపిఐ (ఎం )జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు చెన్నూరి రమేష్ అధ్యక్షత వహించగా... నవతెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లా రీజనల్ మేనేజర్ దేవేందర్ రావు తో కలిసి సిపిఐ(ఎం )జిల్లా కార్యదర్శి బందు సాయిలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ముందుగా సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జే. వెంకటేష్ ఆన్లైన్ ద్వారా మాట్లాడుతూ పార్టీ విధివిధానాలు పత్రిక ఆవశ్యత వివరించారు. అనంతరం బంధు సాయిలు మాట్లాడుతూ.... దాదాపు మీడియా అంతా కార్పోరేట్ కబంధహస్తాల్లో ఉందని కేవలం కార్మిక పే ద బడుగు, బలహీన వర్గాల సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకువచ్చేది 'నవతెలంగాణ' మాత్రమే అన్నారు. కాబట్టి నవతెలంగాణ పత్రికన ప్రతి ఒక్కరు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. పత్రిక సర్క్యులేషన్ పెంచడానికి మండలాల వారీగా కమిటీలు పూర్తి బా ధ్యత తీసుకుని అనుకున్న లక్ష్యం సాధించాలని కోరారు. ఈనె ల 15 నుండి 31 వరకు 'నవతెలంగాణ' పత్రిక స ర్క్యులేషన్ పెంచడానికి ప్రత్యేక కార్యచరణ చేపట్టా మని పత్రిక సర్క్యులేషన్ పెంచాలని కాబట్టి ఈ కా ర్యక్రమాన్ని పార్టీ, పత్రిక ఉద్యోగులు విలేకరులు సహ కరించి విజయవంతం చేయాలని కోరారు.
నవతెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ మేనేజర్ దేవేందర్ రావు మాట్లాడుతూ.. పత్రిక అభివద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు కరోనా కష్టకాలంలో సైతం పత్రిక ముందుకు సాగుతుందని రానున్న ఎన్నికల దష్ట్యా మన గలాన్ని వినిపించేందుకు సర్కులేషన్ ముఖ్యమైందన్నారు. విలేకరులతోపాటు పార్టీ ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు చందాదారులను చేర్పించి అభివద్ధికి తోడ్పడాలన్నారు.సమిష్టి కషితో ప్రస్తుతం పత్రిక విజయవంతంగా నడిపించడం జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వర్క్ షాప్ రోజే (22) సంవత్సరం చందాలు కావడం అభినందనీయమని కొనియాడారు.
చందాదారులకు రసీదు అందజేత...
జిల్లా కేంద్రంలోని శ్రామిక భవనంలో జరిగిన వర్క్ షాప్ లో ఒకేరోజు 22 సంవత్సరం చందాలు పూర్తయ్యాయి ఇందులో పార్టీ నాయకులతోపాటు, వార్డు సభ్యులు సైతం నవతెలంగాణ చందాలను తీసుకున్నారు. దీంతో వరంగల్ రీజనల్ మేనేజర్ దేవేందర్ రావు చేతుల మీదుగా రసీదులను అందజేశారు.ఈ కార్యక్రమంలో నవతెలంగాణ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎర్రం సతీష్ కుమార్, జిల్లా ఇన్చార్జి సుధాకర్, జిల్లా రికవరీ ఇన్చార్జి రంగారావు,
సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొలం రాజేందర్,జిల్లా కమిటీ సభ్యులు వెలిషెట్టి రాజయ్య, సకినాలా మల్లయ్య,గుర్రం దేవేందర్,అత్కురి.శ్రీకాంత్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొలంచిన్న రాజేందర్, పార్టీ సభ్యులు శ్రవణ్,నరేష్,రవికుమార్,రవి, సజన్,అఖిం,విజయ లక్ష్మి,కోమల,కవిత,రజిత, ఆత్కురిశ్రీధర్,గోలిశ్రీనివాస్, ఆయా మండలాల నవతెలంగాణ విలేకరులు పాల్గొన్నారు..