Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలానికి 15 సబ్సీడీ మోటార్ల మంజూరు
- దరఖాస్తులు స్వీకరించని వ్యవసాయాధికారులు
- ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్న ఏఐఎఫ్బీ నాయకులు
నవతెలంగాణ-శాయంపేట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద సన్నకారు, చిన్న కారు రైతుల కోసం సబ్సిడీపై అందజేసిన విద్యుత్ మోటార్లను అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు గుట్టుచప్పుడు కాకు ండా సెలెక్షన్ చేశారు. విషయం తెలుసుకున్న రైతులు దరఖాస్తు ఫారాలను వ్యవసాయ అధికారులకు అందించడానికి వెళ్లగా దరఖాస్తులను తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రర వెంకటరమణా రెడ్డి తీరు పై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే . శాయంపేట మండలానికి 2020-21లో ఎన్ ఎఫ్ఎస్ఎం పథకంలో 15 విద్యుత్ మోటార్లు సబ్సిడీపై మంజూరయ్యాయి. అందులో 10 విద్యుత్ మోటార్లు జనరల్ కేటగిరికి కేటాయించగా, 5 ఎస్సీ కేటగిరికి కేటాయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమ లులో ఉండటంతో వ్యవసాయ అధికారులు సబ్సిడీ విద్యుత్ మోటార్ల విషయాన్ని ప్రకటించలేదు. మార్చి 21న జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఏవో గంగా జమున సబ్సిడీ మోటార్ల విషయాన్ని సభలో ప్రకటించారు. ఐదు ఎకరాల భూమి కలిగిన నిరుపేద సన్నకారు రైతులతో దరఖాస్తు చేయించాలని ఏవో తెలిపారు. దీనిపై పత్రికాముఖంగా కూడా వ్యవసాయ అధికారులు సబ్సిడీ మోటార్ల కోసం దరఖాస్తు చేసు కోవాలని ఎలాంటి పత్రిక ప్రకటన జారీ చేయలేదు.
గుట్టుచప్పుడు కాకుండా సెలక్షన్
సబ్సిడీ విద్యుత్ మోటార్ల విషయం రైతులకు తెలియకపోవడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు తమ అనుచర రైతాంగంతో 50 శాతం చార్జిడిడి లు తీయించి దరఖాస్తు చేయించారు. ఈనెల 31లోగా గడువు ముగియడం, సెలక్షన్ లబ్ధిదారుల జాబితాను ఆన్లైన్లో కూడా పొందుపరచాల్సి ఉండ డంతో స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు వ్యవసాయ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా సబ్సిడీ విద్యుత్ మోటార్ల ఎంపికకు రైతులను సెలక్షన్ చేసి, ఆన్లైన్లో వివరాలను పొందుపరిచారు.
దరఖాస్తులు స్వీకరించని వ్యవసాయాధికారులు
సబ్సిడీ విద్యుత్ మోటార్ల కేటాయింపు తెలు సుకున్న సన్నకారు, చిన్నకారు రైతులు తమ దరఖాస్తులను పూర్తి చేసి వ్యవసాయ అధికారులకు అప్పగించడానికి రాగా దరఖాస్తులను స్వీకరించలేదని రైతులు తెలుపుతున్నారు. వ్యవసాయ అధికారులు ముందుగా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన రైతులను ఎంపిక చేసి వారితో డీడీలు కట్టించి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉందని, నిబంధనలను తుంగలో తొక్కి సబ్సిడీ మోటార్ల విష యాన్ని బయటకు రానీయ కుండా స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒత్తిళ్ల మేరకు వారి అనుచరుల రైతుల దరఖాస్తులను స్వీక రించి సెలక్షన్ చేశారని రైతులు మండిపడుతున్నారు.
సెలక్షన్ పూర్తి చేసి జాబితా ఆన్లైన్ లో అప్లోడ్ చేసా
మండలానికి 15 సబ్సిడీ విద్యుత్ మోటార్లు కేటా యించగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో ఆలస్యంగా మండల సభలో ప్రకటిం చాము. స్థానిక ప్రజా ప్రతి నిధులు గ్రామాలలో అర్హులైన సన్న కారు చిన్నకారు రైతులను ఎంపిక చేసి డీడీలు కట్టారు. మార్చి 31లోగా అర్హులైన రైతుల పేర్లను ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉండగా సత్వరమే పూర్తి చేశాం.
- గంగా జమున, ఏవో శాయంపేట
ఎమ్మెల్యే ఆదేశాల మేరకే జాబితా ఖరారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నకారు రైతుల కోసం సబ్సిడీపై మండలానికి 15 విద్యుత్ మోటార్లు కేటాయించగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీ తిరుపతి రెడ్డి వ్యవసాయ అధికారులపై ఒత్తిడి తెచ్చి రైతుల జాబితా ఫైనల్ చేశారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. మార్చి 31 వరకు దరఖాస్తు గడువు ఉన్నప్పటికీ వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరించలేదు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వెంకట రమణారెడ్డి అప్పటి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సబ్సిడీ ట్రాక్టర్లను తన అనుచరులకు ఇప్పించారని గగ్గోలు పెట్టి, ఇప్పుడు మాత్రం తన అనుచరులకు సబ్సిడీ విద్యుత్ మోటార్లు ఇప్పించడం విడ్డూరం. అధికా రులు కూడా అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అర్హులైన రైతుల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించి అర్హులకే సబ్సిడీ విద్యుత్ మోటార్లు అందజేయాలి.
- దూదిపాల బుచ్చిరెడ్డి, ఏఐఎఫ్బీ మండల నాయకులు