Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీలకతీతంగా అభివృద్ధి చేసుకుందాం
- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
నవతెలంగాణ-జనగామ
జనగామ మున్సిపల్ 2021-2022 అంచనా బడ్జెట్ రూ.14.79 కోట్లు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్మెన్ పోకల జమున అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సమక్షంలో కమిషనర్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2021-2022 అంచనా సాధారణ వ్యయం రూ 11.33 కోట్లు కాగా సాధారన అంచనా ఆదాయం రూ.10.97 కోట్లు, 2021 ఆర్థిక సంవత్సరం ముగింపు నిర్వహణ రూ3.88 కోట్లుగా అంచనా వేశారు. ప్రధానంగా ఆస్తిపన్ను, మ్యుటేషన్ తదితర వాటి నుంచి ఆదాయాన్ని అంచనా వేసారు. ఈ అంచనా బడ్జెట్ను కౌన్సిల్ సభ్యులు చర్చించి ఏక గ్రీవంగా ఆమోదించారు. అనంతరం పట్టణంలోని 59-1 సర్వె నెంబర్లో ఇండ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న పేదలకు ఎలాంటి షరతులు లేకుండా అనుమతులు ఇస్తూ ఇండ్ల నంబర్లను కేటాయించాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా జనగామ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. జనగామ ఆర్టీసీ చౌరస్తా నుంచి సూర్యపేట రోడ్డు నేషనల్ హైవేరోడ్డు వరకు, చౌరస్తా నుంచి చంపక్హీల్స్, పెంబర్తీ రోడ్డు హైవేరోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం నిధులు కెటాయించ నున్నట్టు తెలిపారు. పట్టణంలో ప్రజలకు అవసరమైన పలు అభివృద్ధి పనులను చేపట్టేందులు ఆయా గ్రాంట్స్ నుంచి ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ మేకల రాంప్రసాద్, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.