Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు
నవతెలంగాణ-జఫర్గడ్
వరి పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు కోరారు. మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో బుధవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్యతో కలిసి వారు మాట్లాడారు. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రైతులు భూగర్భజలాలు అడుగంటి వ్యవసాయ బోర్లు ఎండిపో వడంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని అన్నారు. ఎకరం పంట కూడా ఎండనివ్వమని ప్రతి ఎకరాకు సాగునీరు అంది స్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతోందని అన్నారు. జఫర్గడ్ మండలం లో వందలాది ఎకరాల్లో వ్యవసాయ బోర్లు ఎండిపోయి వరి పంట ఎండి పోయిందని, ఇందులో పశువులను మేపుతున్న దుస్థితి నెలకొందన్నారు. ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలానికి కాలువ ద్వారా సాగునీరు అందిస్తామన్న స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజయ్య నేడు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఎగువ ప్రాంతం దయాకర్‌రావు, హరీష్‌రావు నియోజకవర్గాలకు నీళ్లు పోతున్నా ఘన్పూర్ రిజర్వాయర్ పక్కనే ఉన్న జఫర్గడ్ మండలానికి మాత్రం నీళ్లు రావడం లేదన్నారు. మండలం లోని చెరువులు, కుంటలు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నింపాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన రైతు కొంతం లక్ష్మీనారాయణ కొంతం నరసయ్య, వడ్లకొండ యాదమ్మ, చిలివేరు ఎల్లయ్య పలువురు సీపీఐ(ఎం) నాయకులకు గోడు వెళ్లబోసు కున్నారు. వరి పంట పూర్తిగా ఎండిపోయిందని, పంటను కాపాడు కోవడాని అప్పులు చేసి బోర్లు వేసినా నీళ్లు ప డలేదని, తమను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల, గ్రామ నాయకులు గుండెబోయిన రాజు, వేల్పుల రవి, గంగరాజు, నక్క యాకయ్య, శంషోద్దిన్ మల్లేష్ అంబేద్కర్, పెద్దరాములు, సుధాకర్, భాషా యాకూబ్ పాల్గొన్నారు.