Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 12న జనగామలో నీలి దండు కవాత్
- ఏప్రిల్ 30 న అంబేద్కర్ జాతర
- రాజ్యాంగం రిజర్వేషన్ల రక్షణ, ప్రభుత్వ రంగ పరిరక్షణకు ఉద్యమిద్దాం
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-జనగామ
'ఏప్రిల్ నెలను మహణీయుల జయంతి ఉత్సవాల మాసంగా నిర్వహించాలి. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఫూలే, అంబేద్కర్ సందేశ్ యాత్రలు, జాతరలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 12న నీలిదండు కవాత్ నిర్వహించాలి. యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి.' అని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాలోని కేవీపీఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తూటి దేవదానం అధ్యక్షతన నిర్వ హించిన కేవీపీఎస్ జిల్లా విస్తృస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఏప్రిల్ 1 నుండి 30 వరకు ఫూలే, అంబేద్కర్ సందేశ్ యాత్ర ఉంటుందని అన్నారు. ఏప్రిల్ 30న జిల్లా కేంద్రంలో ఫూలే అంబేద్కర్ జాతా నిర్వహిస్తామని అన్నారు. ఏప్రిల్ 12న జిల్లా కేంద్రంలో నీలి టీ షర్ట్ వాలంటీర్ల కవాత్ ఉంటుందని అన్నారు. సామాజిక ప్రజాసంఘాలు యాత్రకు సహకరించి జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం, రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున దాడి చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ దేశ సంపదను కొల్ల గొడుతున్నదన్నారు. దేశ వ్యాప్తంగా దళితులు, గిరిజనులు, మహిళలు, మైనా ర్టీలు బలహీన వర్గాలపై మనువాదుల దాడులు పెరి గాయని అన్నారు. రాజ్యాంగాన్ని తొలగించీ దాని స్థానంలో మనువాదాన్ని అమలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. మనువాదుల కుట్రలకు అడ్డుకట్టవేసి రాజ్యాంగం రిజర్వేషన్ల రక్షణ ప్రభుత్వ రంగ పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని అన్నారు. మహనీయులు జయంతులు ఏప్రిల్ 14న డాక్టర్ అంబేద్కర్, ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతి బా పూలే, ఏప్రిల్ 5న జగ్జీవన్‌రామ్ జయంతులను గ్రామ గ్రామాన నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పల్లెర్ల లలిత, జిల్లా నాయకులు గడ్డం యాదగిరి, బి రఘు రామయ్య, ముగ్గు పోషయ్య, మబ్బు వెంకటేష్, ఎల్లేష్, కలకోట ప్రభాకర్, శాగ సాంబరాజు, మేడ నర్సింహ, కరుణాకర్, అనిత, రమ, సుజాత, కె రమ లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమించాలి : ఆరూరి కుమార్
ములుగు : భారత రాజ్యాంగ పరిరక్షణకు దళిత బహుజనులు ఉద్యమించాలని కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆరూరు కుమార్ ఆన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ కార్యకర్తల సమావేశం జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఇంకొన్ని మతోన్మాద శక్తులు రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర పన్నుతున్నాయ న్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమిం చాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయి వేటు పరం చేసి రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు యత్నిస్తున్నదన్నారు. ప్రయివేట్ రంగంలో రిజర్వే షన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి రోంటాల బిక్షపతి, సభ్యులు ముత్యాల కుమార్ బొల్లి శ్యామ్, కొత్తూరు సాంబయ్య, వినరు కుమార్, బల్గురి విజరు, గుండె రాజేష్, సాగర్ పాల్గొన్నారు.
నెల్లికుదురు : దళిత మహనీయుల జయంతి ఉత్సవాలు వాడ వాడలో నిర్వహించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్ర మహేష్ పిలుపుని చ్చారు. రాజ్యాంగం రిజర్వేషన్లు ప్రభుత్వ రంగ పరిరక్షణకు బుధవారం మండలంలో హెచ్ అశోక్ అధ్యక్షతన మండల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో విద్యా వ్యాప్తికి మహాత్మ జ్యోతిరావు పూలే కృషి చేశారని అన్నారు. విశ్వ విజ్ఞాన దివాస్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని ఐక్య రాజ్యసమితి గతంలోనే ప్రకటించిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కారుచౌకగ కట్టబెడుతున్నారని అన్నారు. ఈ నెల 12న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా మహబూబాద్ జిల్లా కేంద్రంలో నీలి కవాత్‌ను జయప్రదం చేయాలని కోరారు. అలాగే అంబేద్కర్ జాతర నిర్వ హిస్తున్నామని తెలిపారు. సుమారు 200 గ్రామాల్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ యాత్రలు కొనసాగుతాయన్నారు. ఈసంపల్లి సైదులు, టీ వెంకటలక్ష్మి, ఉప్పలయ్య, ఎల్లయ్య, సురేష్, ఈసం పెళ్లి వెంకటయ్య, బొజ్జ రామయ్య, వెంకటయ్య ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు