Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్ బెల్ట్
కరోనా సెకండ్ వేవ్, విస్తృత వ్యాప్తి దష్ట్యా ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, లేనిచో రూ. 1000 జరిమానా విధిస్తామని ఎస్సై ఉదరు కిరణ్ తెలిపారు. భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కూడ లిలో బుధవారం డీఎస్పీ సంపత్ రావు, సీఐ వాసుదేవరావు ఆదేశానుసారం ఆయన పట్టణ వాసులకు, వ్యాపారులకు కరోనా నివారణకు మాస్క్ ధరిం చడం తప్పనిసరని, భౌతిక దూరం, చేతుల పరిశుభ్రత పాటించాలని అవగా హన కల్పించారు. మాస్క్ ధరించకుండా పబ్లిక్ ప్రదేశాల్లో సంచరి ంచినట్టయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ ( విపత్తు నిర్వహణ) చట్టం, ఐపీసీ చట్టం సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు. పట్టణ వ్యాపారస్తులకు షాపుల ముందునో మాస్క్, నో ఎంట్రీ బోర్డులు పెట్టాలని సూచించారు.
గణపురం: కరోనా వైరస్ రోజురోజుకు పెరిగి పోతుందని దానిని అరిట్టేందుకు ప్రజలు తప్పని సరిగా మా స్కుల ధరించాలని ఎస్ఐ శేషాల రాజన్ బాబు తెలిపారు. రెండో దశ కరోనా వేగవంతంగా దూసుకుపోతుందని ప్రతి ఓక్కరు మాస్కు తప్పని సరిగా వాడాలని మాస్కు లేని వారికి రూ. 1000 ఫైన్ వేస్తానని హెచ్చరించారు.