Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోర్జరీ సంతకాలతో కూల్చివేత ఆర్డర్లు
- ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ
నవతెలంగాణ-కాశిబుగ్గ
జీవనోపాధి కోసం అప్పు చేసి నిర్మించుకున్న హోటల్‌ను మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడంతో ఓ దళిత కుటుంబం రోడ్డున పడింది. బాధి తుడు అర్షం స్వామి తెలిపిన వివరాల ప్రకారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలోని 110 ఫిట్ల రోడ్ హైటెన్షన్ వైర్లు కింద సుమారు 5 నెలల క్రితం అప్పు చేసి రెండు లక్షల రూపాయలతో మదీనా కళ్యాణి బిర్యాని పేరుతో హోటల్ ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వత్తి వ్యాపార లైసెన్స్ పొందారు. ఇటీవల కాలంలో కాశిబుగ్గ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం నుంచి హోటల్ తొలగించమని డిప్యూటీ కమిషనర్ పేరుతో నోటీసులు అందగా మరుసటి రోజు స్వామి డీసీని కలిశారు. అయితే డీసీ ఆ సంతకాలు తనవి కాదని ఎవరు పంపించారో తెలియదని తెలిపారు. కానీ అదే మున్సిపల్ అధి కారులు హోటల్ పూర్తిగా నేలమట్టం చేశారు. అయితే హైటెన్షన్ వైర్లు కింద ఇరువైపులా 40 ఫీట్ల వరకు ఎలాంటి కట్టడాలు చేపట్టకూడదని ఉందని, ఎప్పుడు రోడ్డు వచ్చిన తాను స్వచ్ఛందంగా తొలగించకుంటే అని హామీ ఇచ్చినప్పటికీ మున్సిపల్ అధికారులు ఇలా దొంగచాటుగా తన హోటల్లో నేలమట్టం చేయడం వల్ల తమ కుటుంబం రోడ్డున పడిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్న తాధి కారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా బుధవారం కాశిబుగ్గ సర్కిల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ సాంబయ్య ఘటనా స్థలాన్ని సందర్శించారు. కూల్చివేతపై విచారణ జరుపుతామన్నారు.