Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐ తోగిటి రమేష్ కుమార్
నవతెలంగాణ-శాయంపేట
కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, మాస్కులు ధరించకుండా బహిరంగంగా తిరిగితే జరిమానాలు విధిస్తామని సీఐ తోగిటి రమేష్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేష న్ ఛాంబర్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా వైరస్ సెకండ్ వేవ్ రూపకంగా అతి వేగంగా వ్యాప్తి చెందుతుందని, పరకాల రూర ల్ సర్కిల్ పరిధిలోని శాయంపేట, దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజ లు వైరస్ తీవ్రతను అర్థం చేసుకుని పనుల నిమిత్తం ఇంటి నుండి బయ టకు వచ్చేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజల అందరి సహకా రంతోనే వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు.
మల్హర్ రావు: కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉజం భిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ మరియు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని లేదంటే కేసుతోపాటు జరిమానా విధించడం జరుగుతుందని కాటారం సీఐ హాతీరాం అన్నారు. బుధవారం కొయ్యుర్లో ప్రజలకు కొవిడ్ నిబంధనలపై అవగాన కల్పించారు. ప్రతి ఒక్కరూ విదీగా సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొయ్యుర్ ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు.
ధర్మసాగర్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు ధరించి ఉంటే చర్యలు తప్పవని సీఎం రమేష్ కుమార్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిష నర్ పి. ప్రమోద్ కుమార్ ఆదేశాల మేరకు విధిగా ప్రతి ఒక్కరు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు బొడ్డు లెనిన్, అంకం సదానందం, చిలుక రవీందర్, మండల అధ్యక్షులు బోడ్డు భరత్, బొడ్డు సోమయ్య, మాచర్ల రవీందర్, బొడ్డు ప్రతాప్, నిమ్మ సమ్మిరెడ్డి పాల్గొన్నారు.