Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజిపేట
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ సాధన కోసం ఏర్పడిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉండగా బుధవారం కోచ్ ఫ్యాక్టరీ పోరాట సమితి కమిటీ సభ్యులు దేవులపల్లి రాఘవేంద్ర అధ్యక్షతన కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి వరంగల్ రైల్వే జంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ సాధన కొరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు , జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలతోపాటు అఖిలపక్షం నాయకులు కుల సంఘాల నాయకులు రైల్వే కార్మికులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కోచ్ ఫ్యాక్టరీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని నినాదాలు చేస్తూ కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి వరంగల్ రైల్వే జంక్షన్ వరకు భారీ గా బైక్ ర్యాలీ నిర్వహించారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం ఏప్రిల్ 5 వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి మద్దతుగా ఈ ర్యాలీని నిర్వహించారు. ట్రాఫిక్ ఏసీపీ బాలస్వామి ఆధ్వర్యంలో రోడ్డుపై బైక్ ర్యాలీ వెళుతుండగా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు తోట్ల రాజు యాదవ్, లింగ మౌనిక చరణ్ రెడ్డి జక్కల రమ రవీందర్ యాదవ్, సందెల విజరు, సయ్యద్ రజాలి, టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, టిఆర్ఎస్ నాయకులు గబ్బెట శ్రీనివాస్ ,కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ సాధన సమితి సభ్యులు గాదె ఇన్నయ్య ,కాలువ శ్రీనివాస్, గోపు సోమన్న, నర్సింగరావు, పాక వేద ప్రకాష్ కర్ర యాదవ రెడ్డి, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, రమేష్, భాస్కర్, ఆంజనేయులు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ సాయిని నరేందర్, బహుజన లెఫ్ట్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చింతకింది కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.