Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని ఎడపల్లి గ్రామంలో ఇప్పటివరకు రెండు వందల ఇరవై మందికి కోవిద్-19 పరీక్ష నిర్వహించగా 29 మందికి పాజిటివ్ వచ్చినట్టు డాక్టర్ రామారావు తెలి పారు. గత నెల 15 నుంచి 20 వరకు గ్రామంలో చిరుతల రామాయణం సంస్కతి కార్యక్రమం నిర్వహిం చడంతో వారి బంధువులు చుట్టుపక్కల గ్రామాల వారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో మొదటిసారిగా మహదేవ్పూర్ పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 10వ తరగతి చదువుతున్న బాలికకు పాజిటివ్ కావడంతో అప్పటి నుంచి ప్రతిరోజు ఎడపల్లి గ్రామంలో కోవిద్ పరీక్షలు నిర్వహిస్తుండగా ఇప్పటివరకు 29 మందికి పాజిటివ్ రావడంతో మంగళవారం జిల్లా ఆరోగ్య శాఖ అధికారి సుధాకర్ సింగ్ సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రామారావును ఎడపల్లి గ్రామాన్ని సందర్శించి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించగా బుధ వారం 27 మందికి పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ రావడంతో 29కి చేరింది. దీంతో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి మమతా దేవి ఆదేశాల మేరకు లాక్ డౌన్ ప్రకటించి గ్రామంలో ఎవరు రాకుండా గ్రామానికి చెంది న వారు బయటకు రాకూడదు అని ఊరి చివర ముళ్ళ కంచె వేశారు. 45 సంవత్సరాల వయస్సు ఉంది కరోనా లేని వారికి టీకా వేయాలని గ్రామానికి సంబంధించిన లిస్టు తయారు చేయాలని గ్రామ కార్యదర్శి ఆదేశించారు.