Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రిల్ స్పై నడవలేక కూర్చుని వెళ్తున్న వైనం
నవతెలంగాణ-శాయంపేట
పుట్టుకతోనే పోలియో వ్యాధి బారిన పడడంతో కాళ్లు చచ్చుబడి రెండు చేతి కర్రలపై ఆధార పడుతూ నడుస్తున్న వికలాంగుడు తహసిల్దార్ కార్యాలయం ముందు గ్రిల్ స్పై నడవలేక కూర్చొని పాకుకుంటూ వెళ్తుండటం బుధవారం నవతెలంగాణ క్లిక్ మనిపించింది. మండలంలోని నూర్జహాన్ పల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు కౌడగాని రాజేశ్వరరావు తన వ్యవసాయ క్షేత్రంలో 400 టేకు మొక్కలు నాటించారు. గత ఏడాది ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు మొక్కలు నీటిలో మురిగిపోయి చనిపోయాయి. మిగిలిన 20 నుండి 30 మొక్కలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఉపాధి హామీ 13 వ విడత సామాజిక తనికి సోషల్ ఆడిట్ ఓపెన్ ఫారం బుధవారం తహసిల్దార్ కార్యాలయంలో జరగగా ఆ గ్రామ కార్యదర్శి ప్రశాంత్ రైతు రాజేశ్వరరావు రమ్మన్నారు. వ్యయప్రయాసలను ఓర్చుకుని సమావేశానికి హాజరు కాగా సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో వెళ్ళి పోమన్నారు. ఈ సమావేశానికి తనను ఎందుకు రమ్మన్నారని, ఎందుకు పొమ్మంటున్నారని ఉసూరుమంటూ వెళ్లిపోవడం నవతెలంగాణ కంటపడింది.