Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాళాలు పగలకొట్టిన వైనంపై కేసు నమోదు చేయాలి
- స్పష్టత లేని ఖర్చుల లెక్కపై మహాజన సభలో నిలదీత
నవతెలంగాణ-నర్సంపేట
నర్సంపేట పీఏసీఎస్‌లో జరిగిన అవకతకలు, రుణాల పంపిణీలో రైతుల నుంచి అక్రమ వసూళ్లు, కార్యాలయం తాళాలు పగలకొట్టిన వైనంపై చైర్మన్ మురాల మోహన్ రెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులకు సేవలందించడంలో వైఫల్యం చెందారని బాధ్యతరహితంగా వ్యవహరిస్తూ సొసైటీ పరువు మంటగలిపారని పాలకవర్గాన్ని తూర్పా రపట్టారు. మహాజన సభ నివేదికలో పేర్కొన్న జమ, ఖర్చుల లెక్కల్లో స్పష్టత లేదని మండిపడ్డారు. బుధవారం వాసవీ కళ్యాణ మండపంలో ప్రాథమిక వ్యవసాయ సహాకార సం ఘం మహాజన సభ చైర్మెన్ మురాల మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. తొలత అధ్యక్షుల స్వాగతోపన్యాసం ముగిసాక ఏజెండా అంశాలను ప్రస్తా వించారు. సొసైటీలో జరుగుతున్న తధంగంపై 'నవతెలంగాణ'లో వచ్చిన కథనం సభలో చర్చనీయంగా మారింది. కిందటి నెల 2న సొసైటీ కార్యాల య తాళాలను రాత్రి వేళలో చైర్మెన్ ఎందుకు పగలకెట్టాల్సి వచ్చిందని నాడెం శాంతి కుమార్, కొరబోయిన కుమారస్వామి, సురేందర్ తదితర పలువురు రైతులు ప్రశ్నించారు. కార్యాలయంలోని రికార్డు లను మాయం చేశారని అనుమానాలు వ్యక్తమౌతున్నాయన్నారు. చైర్మన్ బాధ్యతరహితంగా వ్యహరించాడని వెంటనే చైర్మెన్ జవాబు చెప్పాలని పట్టుపట్టారు.తాళాలు పగలగొట్టితే సీఈవో ఏం చేస్తున్నట్లు వెంటనే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. వెంటనే చైర్మన్, సిబ్బందిపై కేసు పెట్టాలని మహాసభ తీర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. రబీలో రూ.23.75లక్షలు, ఖరీఫ్‌లో 9.76లక్షల విలువజేసే ధాన్యం కొనుగోలు చేస్తే సొసైటీకి రూ.33.52 లక్షలు లాభం వచ్చిందని ఎలా చెబుతారని ఇచ్చిన నివేదికలో స్పష్టత లేదని కొరబో యిన కుమారస్వామి అనే రైతు తప్పుపట్టారు.కొత్తగా 227 మందికి రుణాలు ఇచ్చే పేరిట ఒక్కో రైతు వద్ద రూ.3వేల నుంచి 5వేలు దండుకున్నారని ఆరోపించారు. గోనె సంచుల లెక్కల్లో అవకతవకు జరిగాయని దీనివల్ల సొసైటీకి లక్షల్లో రావాల్సిన కమీషన్ ఆగిపోయిందని తెలిపారు. అంశాలపై సభలోని రైతులు ఇందుకు మద్దతు పలికి చైర్మన్, సీఈవోతో వాగ్వివాదానికి దిగారు.చైర్మెన్ మోహన్ రెడ్డి ఇచ్చిన సమాధానంపై రైతులు సంతృప్తి చెందలేదు. సొసైటీలో 5వేల మంది సభ్యులు రూ.1000పై రూ.100లు తమ వాటాధనం చెల్లిస్తే ఇప్పటి వరకు ఎంత ఉందో నివేదికలో చెప్పిందిలేదని ఇంతకు వాటాధనం ఎం అయినట్టు అని చిలువేరు కొమ్మాలు అనే రైతు ప్రశ్నించారు. చనిపోయిన సభ్యుల వాటాధనం ఇంత వరకు వారి కుటుంబ సభ్యులకు చెల్లించాలని, అప్పులు రెగ్యూలర్‌గా చెల్లించిన రైతులకు వాటాధనాన్ని ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ చైర్మన్ గుజ్జుల మాధవరెడ్డికి చైర్మన్ మురాల మోహ న్‌రెడ్డికి నడుమ కొద్ది సేపు పరుష పదజాలల పర్వం కొనసాగడం పలువురిని విస్మయానికి గురిచేసింది. ఇన్ని అవకతకలు జరు గుతుంటే పాలకవర్గ సభ్యులు ఎంచేస్తున్నారని రైతుల నిలదీతలతో కొద్ది సేపు గందరగోళంగా మారింది.
రైతుల కోసమే తాళాలు పగలకొట్టాం: చైర్మెన్
మిగిలిన పోయిన కొందరి రైతులకు పంట రుణాలు ఇప్పించేందుకే రాత్రి వేళల్లో సిబ్బంది ఎదుట తాళాలు పగలకొట్టామని చైర్మెన్ మురాల మోహన్ రెడ్డి సంజాయిషీ ఇచ్చారు. సభ్యులు అడిగిన పలు అంశాలను ప్రస్తా విస్తూ పంట రుణాల పంపిణీలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. సభ్యుల వాటాధనం ఇప్పటిదాకా డీసీసీబీలో జమ చేయబడిందని, ఇటివల సొసైటీల ఖాతాలలో జమ చేస్తామని చెప్పారని సీఈవో మధు తెలిపారు. కార్యాలయ తాళాలు పగలగొట్టిన వైనంపై సభ్యుల ప్రతిపాదన మేరకు పోలీసుకు ఫిర్యాదుపై తీర్మాణం చేస్తున్నట్లు చెప్పారు.
సొసైటీ లావాదేవిలపై నివేదిత..
సొసైటీలో రూ.97.38 కోట్లకు గానూ మొత్తం ఖర్చు రూ.97.38కోట్ల వివిధ పద్దుల కింద ఖర్చు చేసినట్లు వెల్లడించారు.సంఘం ఫిక్స్డ్ డిపాజిట్లు రూ. 21.033 కోట్లకు వడ్డీ రూ. 20.81లక్షలు రాగా మొత్తంగా రూ. 2.31 కోట్లు ఉన్నట్లు తెలిపారు. 2019-20 రబీ సీజన్లో 79196 క్వింటాల్ కొనుగోళ్లకు రూ.23.11లక్షలు, 2020-2021 ఖరీఫ్ సీజన్లో 32561.6 క్వింటాల్ కొనుగోళ్లపై రూ.9.76లక్షల కమీషన్ రావాల్సి ఉందని మొత్తంగా రూ.33.52లక్షల పైచిలుకు సివిల్ సప్లరు నుంచి సొసైటీకి కమీషన్ జమకావాల్సి ఉందని వివరించారు. నాలుగు ఫర్టిలైజర్ సెంటర్ల నుంచి రూ.4.23లక్షలు లాభంగా వచ్చిందన్నారు. 227 మంది రైతులకు రూ.1.40కోట్ల పంట రుణాలను అందజేశామని తెలిపారు.