Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కృష్ఱ ఆదిత్య
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో రెండు రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు ఉత్పత్తి దారుల సంఘాల ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాల యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రైతులను సంఘ టితం చేసి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి మార్కెటింగ్ చేసుకొని వ్యవసా యాన్ని లాభ సాటిగా మార్చుకోవాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సంబంధిత శాఖల అధికా రులతో కమిటీ వేసి కమిటీ నిర్ణయం మేరకు మహాదేవపూర్ లో ఒక సంఘం, భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండ లాలను కలిపి మరొక రైతు ఉత్పత్తి దారుల సంఘాన్ని ఏర్పాటు చేయుటకు కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ఈ నిర్ణయం మేరకు వెంటనే జిల్లాలో 2 రైతు ఉత్పత్తి దారుల సంఘాలను స్థాపించి ఒక్కో సంఘంలో 300 మంది రైతులకు తగ్గకుండా సభ్యులను చేర్పిం చాలన్నారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో వ్యవ సాయంలో చురుగ్గా వ్యవహరించే రైతులను సంఘ సభ్యులుగా చేర్చి సంఘాలు త్వరగా అభివద్ధి చెంది వ్యవ సాయాన్ని లాభసాటిగా చేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎల్డిఎం శ్రీనివాస్, నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి విజయభాస్కర్, జిల్లా ఉద్యానవన అధికారి అక్బర్, జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి పురుషోత్తం, జిల్లా మత్స్యశాఖ అధికారి భాస్కర్, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి డా. కుమారస్వామి, కషి విజ్ఞాన కేంద్రం అధికారులు కుమారస్వామి, రవీందర్ పాల్గొన్నారు.
రైతులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి
రైతు వేదికల ద్వారా రైతులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివద్ధి, సంక్షేమ పథకాల ప్రగతి పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో చేపట్టిన అభివద్ధి కార్యక్రమాల ద్వారా పల్లెలు అభివద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని ఈ కార్యక్రమం ద్వారా నిర్మించిన అన్ని నిర్మాణాలను ఉపయో గంలోకి తీసుకురావాలన్నారు. ఆత్మ కార్యక్రమం ద్వారా రైతులకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన పరికరాల కోసం ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపించాలన్నారు. ఉద్యానవన పంటల ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందేలా ఉద్యానశాఖ అధికారులు రైతులకు ఉద్యానవన పంటల పై అవగాహన కల్పించి కూరగాయల పెంపకానికి సబ్సిడీ తో పరికరాలు అందించి రైతులను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డిఓ పురుషోత్తం, డిఏఓ విజరు భాస్కర్, కలెక్టర్ కార్యాలయ ఏవో మహేష్ బాబు, హార్టికల్చర్ అధికారి అక్బర్, డిఈఓ హైదర్ హై, డిడబ్ల్యూఓ శ్రీదేవి, డీపీఆర్ఓ రవికుమార్, జెన్కో, ఏఎమ్ఆర్ కంపెనీల ప్రతినిధి పాల్గొన్నారు.