Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
ప్రజల సౌకర్యార్థం క్రిమిసంహారక యంత్రం ఏర్పాటు చేసినట్లు బల్దియా కమిషనర్ పమేలా సత్పతి తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత లో భాగంగా ఇంద్ర వాటర్ శుద్దికరణ సంస్థ వారు ప్రధాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన వజ్ర కవచ్ యంత్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్కువ వ్యయం, ఎక్కువ ప్రభావ వంతంగా పని చేసేలా, మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో ఆస్కి భాగస్వామ్యం తో తొలిసారిగా బల్దియాకు మిషన్‌ను అందజేయడం హర్షణీ యమన్నారు. వివిధ అవసరాల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. వారు ఉపయోగించే సాధారణ మా స్కూలు, ఎన్-95 మాస్కులు, జాకెట్లు, వాలెట్లు, గాడ్జెట్లు,మెడికల్ యంత్ర సామాగ్రి,ఫేస్ షీల్డ్స్,గాగుల్స్, ల్యాబ్‌లో ధరించే కోట్లు తదితర వస్తువులను ఈ యంత్రంలో 3 నిమిషా లపాటు ఉంచడం ద్వారా ఇందులో అతినీల లోహిత కిరణాలు బ్యాక్టీరియా, వైరస్ లను అంతం చేస్తాయన్నారు. ఇందు లో ఓజోన్ వాయువు ఉండడం వల్ల సార్స్ వైరస్‌తో పాటు వ్యాధులను కలిగించే ఇతర వైరస్‌లను చంపివేస్తాయని చెప్పారు. ఐఐటీ బొంబాయికి చెందిన బయో సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్ విభాగాలు పరీక్షించి యంత్ర పనితీరును ఆమోదిం చాయన్నారు. ఈ సందర్భంగా ఇంద్ర సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ నగరంలోని జన సమర్ధ ప్రాంతాల్లో, కార్యాలయాల్లో యంత్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తమను సంప్రదిస్తే మరిన్ని యం త్రాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో అదనపు కమిషనర్ సిహెచ్ నాగేశ్వర్, ఆస్కి ప్రతినిధులు రాజ్ మోహన్, అవినాష్, ఇంద్ర కంపెనీ సహా వ్యవస్థాపకులు అభిజిత్, ఇంజనీర్ శివ, భాస్కర్ పాల్గొన్నారు.