Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పాదయాత్ర రథసారథి బంధు సాయిలు
నవతెలంగాణ-భూపాలపల్లి
రాంపూర్ నుంచి అజాంనగర్ వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని సీపీఐ(ఎం) పాదయాత్ర రధసారథి బంధు సాయిలు అన్నారు. రెండో రోజు పాదయాత్ర నందిగామ దీక్షకుంట, గొల్ల బుద్ధారం, చికెన్ పల్లి, రాంపూర్, రాజీవ్ నగర్, నాగారం మీదుగా మహాముత్తారం మండలం లోకి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ఊర్లలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. నాగారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. అన్ని ఊర్లలో ఉన్న చెరువులకు కుంటలకు అన్నారం మేడిగడ్డ దేవాదుల నీళ్లను సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రభుత్వం నుంచి రుణాలు అందించాలని కోరారు. ప్రతి ఊర్లో ఒక గ్రామంలో గ్రామ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. సాగుచేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలని తెలిపారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయానికి పోడు భూముల్లో ట్రాక్టర్లను అనుమతించాలని బోర్లు ప్రభుత్వమే వేయిం చాలని కోరారు. దళిత గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు చేస్తున్న దాడులను అరికట్టాలన్నారు పాద యాత్ర బందం సభ్యులు గుర్రం దేవేందర్ దామర కిరణ్, నాగుల అరవింద్, పసుల వినరు, సూదుల శంకర్, ఆత్కూరి శ్రీకాంత్, పొలం రాజేందర్ బి.చక్రపాణి, నరేష్, వావిలాల రాజేందర్, రవి, గోపాల్ పాల్గొన్నారు.